
పేదల కడుపు నింపడమే ధ్యేయం
జఫర్‌గఢ్: పేదల కడుపు నింపడమే ధ్యేయంగా ప్రభుత్వం సన్న బియ్యం పథకం అమలు చేస్తోంద ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రేగడితండాలోని బానోత్ కిషన్‌నాయక్ ఇంట్లో కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలసి ఎమ్మెల్యే సన్న బియ్యంతో వండిన భోజనాన్ని గురువారం వారి కుటుంబ సభ్యులతో భుజించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ధనికులు తినే సన్న బియ్యాన్ని పేదలకు అందిస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కిందన్నారు. అనంతరం అల్వార్‌బండతండాలో ఈనెల 16న సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన శిలాఫలాకాన్ని కలెక్టర్‌తో కలసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి రాధాకిషన్, తహసీల్దార్ శంకరయ్య, ఎంపీడీఓ సుమన్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి