
ప్రతీ ఇంట్లో ఎర్త్ వైరింగ్ ఏర్పాటుచేసుకోవాలి
– కూరాకుల పాల్, ఎలక్ట్రీషియన్
నెహ్రూసెంటర్: ఇళ్లలో వినియోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో వాడుకునే ఫ్రిజ్, టీవీ, ఏసీ, కూలర్, ఫ్యాన్, వంటి వాటిని పిల్లలు ముట్టుకోకుండా చూసుకోవాలి. దీంతో పాటు వేసవిలో విద్యుత్ సరఫరా, అంతరాలు జరిగినప్పుడు, వడ గాలుల వల్ల విద్యుత్ వైర్లు తెగినప్పుడు వాటిని సరి చేసుకునే వరకు ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించొద్దు. సొంతంగా ఎలక్ట్రీషియన్ పనులు చేయవద్దు. అకాల వర్షాల కారణంగా వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు పడిన సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఎలక్ట్రానిక్ వస్తువులను కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించకూడదు. ఇంట్లో వస్తువులను ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా ఎర్త్ వైరింగ్ చేయాలి. చార్జింగ్ తీసిన తర్వాత ఫోన్ వినియోగించుకోవాలి. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా వాడితే మంచి క్వాలిటీ కలి గిన విద్యుత్ వైర్లను వినియోగించాలి. ఇంటి ఆవరణలో ఇనుప తీగలతో దండాలు కట్టుకోవద్దు. దీని వల్ల విద్యుత్ ప్ర మాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైతే మెకానిక్, ఎలక్ట్రీషియన్‌కు చూపించాలి.

ప్రతీ ఇంట్లో ఎర్త్ వైరింగ్ ఏర్పాటుచేసుకోవాలి