
చిన్న పిల్లల్లో హీట్ స్ట్రోక్
– డాక్టర్ సుధాకర్, పిడియాట్రిషన్
ఎంజీఎం : హీట్ స్ట్రోక్ (ఎండదెబ్బ) వల్ల ఎండాకాలంలో పిల్లలు బాగా ఇబ్బందులు పడుతుంటారు. ఎక్కువగా ఎండలో తిరిగేవారు, శుభకార్యాలకు వెళ్లేవారు, ఇంటి ఆవరణలో ఎండలో, ఆట స్థలంలో తిరిగే పిల్లలకు ఎక్కువగా హీట్ స్ట్రోక్‌కు గురవుతారు.
హీట్ స్ట్రోక్ లక్షణాలు..
● శరీరం బాగా వేడెక్కడం. వాంతులు, విరోచనాలతో శరీరంలో నీటిశాతం పడిపోతుంది
● పిల్లలకు మూత్రం సరిగ్గా రాకపోవడం, ఎర్రగా రావడం. ఎండలో తిరిగే పిల్లలు తొందరగా అలిసిపోవడం, తలనొప్పి, శరీరంలో నొప్పులు, నరాల బలహీనత , తీవ్ర అస్వస్థతతో కోమాలోకి వెళ్తారు.
● పసిపిల్లలు డల్‌గా ఉంటారు. బరువు తగ్గడం, పాలు సరిగ్గా తాగకపోవడంలాంటి లక్షణాలు ఉంటాయి.
● అందుకే పిల్లలు ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండాలి. ప్రయాణాలు తగ్గించుకోవాలి.
● పిల్లలు ఎక్కువగా నీళ్లు తాగాలి. ఓఆర్‌ఎస్ తాగించాలి.
● వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరింపజేయాలి.

చిన్న పిల్లల్లో హీట్ స్ట్రోక్