
మలేరియా నిర్మూలనకు కృషి చేయాలి
జనగామ రూరల్: మలేరియా నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. గ్రామ స్థాయిలో పరిసరాల పరిశుభ్ర త పాటించడంతోపాటు నీటి గుంతల నిర్వహణ, కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ కంటేయినర్లు తదితరా లను ఇష్టానుసారంగా వేయకుండా ప్రజలకు వివరించాలని చెప్పారు. దోమ కాటు నుంచి రక్షణ, దోమలతో వచ్చే వ్యాధులకు సకాలంలో చికిత్స అందేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా మలేరియా నివారణకు కృషి చేసిన సిబ్బంది టి.రవీందర్, ఫీల్డ్ వర్కర్ ముస్తఫా, అలివేలు మంగ, యాదలక్ష్మి తది తరులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్ర మంలో డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు, ప్రోగ్రాం అధికారి డాక్టర్ అశోక్, డాక్టర్ కమల్‌హాసన్ తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఎంపిక వేగంగా చేపట్టాలి
జనగామ రూరల్: నిబంధనలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వేంగంగా చేపట్టా లని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జనగామ నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించా రు. ఈనెల 29లోగా వెరిఫికేషన్ పూర్తి చేసి మే 2న జీపీల్లో అర్హుల జాబితా ప్రదర్శించాలన్నారు. సమా వేశంలో స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీఓ గోపీరాం, హోసింగ్ పీడీ మాతృనాయక్, మున్సిప ల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా