
కలిసికట్టుగా ముందుకు సాగుదాం
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
బచ్చన్నపేట : నియోజకవర్గ అభవృద్ధికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ ముందస్తు ప్రణాళిక వేసుకుందామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతోందని, ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో గురువారం మండల కేంద్రంలోని శ్రీనిధి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రజతోత్సవ సభకు ప్రజలను సమాయత్తం చేయాలని, గ్రామానికో వాహనాన్ని పంపించడంతో పాటు ఇన్‌చార్జ్‌లను నియమించాలని చెప్పారు. కార్యక్రమంలో పీఏసీ ఎస్ చైర్మన్ పులిగిళ్ల పూర్ణచందర్, నాయకులు ఇర్రి రమణారెడ్డి, బొడిగం చెంద్రారెడ్డి, గంగం సతీష్‌రె డ్డి, బావండ్ల కృష్ణంరాజు, మద్దికుంట రాధ, కొండి వెంకట్‌రెడ్డి, చల్ల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.