
ధాన్యం తెచ్చి 12రోజులైంది..
మూడు ఎకరాల్లో వరి సాగు చేయగా.. 150 బస్తాల దిగుబడి మాత్రమే వచ్చింది. ఇంతకు ముందు సీజన్లలో 250 బస్తాల వరకు వచ్చింది. వడ్లు అమ్మడానికి 12 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి వచ్చిన. తేమ ఉందని తీసుకోలేదు. ఆరబోసి ఎదురు చూస్తున్నాను.
– ముదావత్ హర్య, అల్యతండా(అబ్దుల్‌నాగారం)
సెంటర్లపై నిత్యం పర్యవేక్షణ
జిల్లాలోని ధాన్యం కొనుగోలు సెంటర్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. అకాల వర్షాల నేపథ్యంలో టార్పాలిన్ కవర్లను అవసరం మేరకు అందుబాటులో ఉంచాం. సంబంధిత శాఖల ఉన్నతాధికా రులు పర్యటిస్తూ కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడడంతో పాటు రైతులకు సౌకర్యాల కల్పనపై దృష్టి సారించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంట నే డబ్బు చెల్లింపులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– రోహిత్‌సింగ్, అదనపు కలెక్టర్(రెవెన్యూ)