
తీవ్రవాదాన్ని తుదముట్టించాలి
జనగామ: ‘పహల్గాం’ ఘటనలు పునరావృతం కావొద్దు.. అమాయకులను పొట్టనపెట్టుకున్న టెర్రరిస్టులను వదిలిపెట్టొద్దు.. తీవ్రవాదాన్ని తుదముట్టించాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌యూ టీఎఫ్, ముస్లింలు, ఐఎంఏ(వైద్యులు) ఆధ్వర్యాన గురువా రం రాత్రి జిల్లా కేంద్రంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. నెహ్రూపార్కు నుంచి ఆర్టీసీ చౌరస్తా అంబేడ్కర్ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో తీవ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కశ్మీర్ దుర్ఘట నను ముస్లింలు ముక్తకంఠంతో ఖండించారు. పర్యాటకులే లక్ష్యంగా అమాయకుల ప్రాణాలు తీయడం హేయమైన చర్య అని అన్నారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేష్, కృష్ణ, కనకయ్య, ఆగయ్య, ముస్లిం ప్రతినిధులు అడ్వకేట్ జమాల్ షరీఫ్, మహమ్మద్ అబ్దుల్‌ఖాదర్, మసిఉర్ రెహమాన్, ఎండీ.జావీద్, ఎండీ.బాసిత్, ఎండీ రషీన్, ఎండీ.షకీల్, రషీద్, అంకుశావలి, తహసీన్ సికిందర్, గులాం, సలీం, బాబా, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్లు బాలాజీ, రాజమౌళి, శ్రీకాంత్, కల్నల్ భిక్షపతి, శ్రీనివాస్, రజిని, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్, ముస్లింలు,
ఐఎంఏ ఆధ్వర్యాన కొవ్వొతుల ర్యాలీ

తీవ్రవాదాన్ని తుదముట్టించాలి

తీవ్రవాదాన్ని తుదముట్టించాలి