
హజ్ యాత్రికులు ఆరోగ్య సూత్రాలు పాటించాలి
జనగామ: హజ్ యాత్రికులు ఆరోగ్య సూత్రాలు పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్‌రావు అన్నారు. అర్బన్ పీహెచ్‌సీలో వైద్యారోగ్య శాఖ, హజ్ సొసైటీ ఆధ్వర్యాన గురువారం సొసైటీ జిల్లా ఉపాధ్యక్షుడు జహీరుద్దీన్ అధ్యక్షతన హజ్ యాత్రికులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీకా శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మక్కా వాతావరణం అత్యంత వేడిగా ఉండడంతో యాత్రికులు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకుంటూ.. జాగ్రత్తలు పాటించాలని సూచించారు. శ్వాస కోశ వ్యాధులు రాకుండా మాస్కులు ధరించి అంటు వ్యాధుల బారిన పడకుండా చేతులను శుభ్రం చేసుకోవాలని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు సమయానికి మందులు వేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి హజ్‌యాత్రకు వెళ్లే ముగ్గురు యాత్రికులకు టీకాలు వేసి ఐడీ కార్డులు అందజేశారు. కార్యక్రమంలో జనగామ హజ్ కమిటీ అధ్యక్షుడు ముజ్తహిదొద్దీన్, కార్యదర్శి జహీరుద్దీన్, డాక్టర్ శ్రీతేజ, డాక్టర్ ఇంజమామ్‌అలీ, రిటైర్డ్ సీహెచ్‌ఓ రెహమాన్, సీహెచ్‌ఓ జయపాల్‌రెడ్డి, ఎంపీహెచ్‌ఈఓ ప్రభాకర్, మేరాజ్ ఉర్‌రెహ్మాన్, మసిఉ ర్ రెహాన్‌జాకీర్, హఫీజ్, జలీల్, ఖలీముద్దీన్, నూరుద్దీన్, రషీదా పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్‌రావు