
దేశం.. ఎల్కతుర్తి వైపు చూస్తోంది
ఎల్కతుర్తి: దేశం.. ఎల్కతుర్తి వైపు చూస్తోందని, ఈనెల 27న పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ రాజకీయ పార్టీ సమావేశం కాదని, రాష్ట్ర ప్రజలందరి పండుగ అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంతో పాటు చింతలపల్లి సమీపంలో రజతోత్సవ సభ ఏర్పాట్లను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి సభ ఏర్పాట్లు పరిశీలించారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 50 వేల మంది తరలివస్తారని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వెల్లడించారు. పరిశీలించిన వారిలో పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నాయకులు పేర్యాల రవీందర్‌రావు ఉన్నారు.
నేతల తాకిడి..
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నేతలు పరిశీలించారు. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాజ్యాసభ సభ్యులు మద్దిరాజు రవిచంద్ర, బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, ఉమ్మడి ఖమ్మం నుంచి రేగా కాంతారావు, హరిప్రియ, కామారెడ్డి నుంచి జాజుల సురేందర్ తదితర నేతలు సభాస్థలికి రాగా వారికి ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, నాగుర్ల వెంకన్న ఏనుగుల రాకేశ్‌రెడ్డి తదితరులు సభా ప్రాంగణంలో ఏర్పాట్ల గురించి తెలిపారు. వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాలను చూపించారు.
దండులా కదిలిరావాలి..
రజతోత్సవ సభకు ప్రజలు దండులా కదిలి రావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లాకు కేటాయించిన పార్కింగ్ స్థలాన్ని ఆయన పరిశీలించారు.
మాజీ మంత్రి గంగుల కమలాకర్
సభాస్థలి పరిశీలన