
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
జనగామ: ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 27న తలపెట్టిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వరంగల్‌లో జరిగే సభాస్థలికి వెళ్లే క్రమంలో ఆయన జనగామ ఆర్టీసీ చౌరస్తాలో కాసాపు ఆగగా, నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తిరుగు ప్రయాణంలో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో సమావేశమయ్యారు. రజతోత్సవ సభ దేశ చరిత్రలో నిలిచి పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మైనార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ సలీం, సాజిద్ భాయ్, జహంగీర్ హుస్సేన్, పానుగంటి ప్రవీణ్, గులాం జానీ, రిజ్వాన్, తిప్పారపు విజయ్, సయ్యద్ ఫజల్, రాజేష్ రెడ్డి, అన్వర్ పాషా, అక్తర్ పాషా, ఆమీర్ రాజ్, కుమార్, తదితరులు ఉన్నారు.
మాజీ హోంమంత్రి మహమూద్ అలీ