
‘భూ భారతి’పై అవగాహన ఉండాలి
స్టేషన్‌ఘన్‌పూర్: భూ రికార్డుల్లో తప్పులను సరిదిద్దడానికి, రైతులకు మెరుగైన సేవలు అందించడానికి భూ భారతి–2025 చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో స్థానిక రైతువేదికలో శనివారం భూ భారతి (భూమిపై హక్కులు, రికార్డులు) చట్టంపై అవగాహన సదస్సును నిర్వహించారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా కడియం హాజరై మాట్లాడారు. పార్ట్ బీ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది పారదర్శకంగా పనిచేయాలన్నారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి చట్టం పనిచేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రో హిత్‌సింగ్, ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, ఎంపీడీఓ విజయశ్రీ, ఆర్‌ఐలు శ్రీకాంత్, సతీష్, డీటీ ఫణికిషోర్, రైతులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి