
ఉగ్రదాడులు అమానుషం
జనగామ రూరల్: పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి జనగామ కవులు, కళాకారులు నివాళులర్పించారు. ఐక్యవేదిక ఆధ్వర్యాన శనివా రం పట్టణం పరిధి అంబేడ్కర్ నగర్‌లోని అంబేడ్క ర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పర్యాటకులపై ఉగ్రదాడులు అమానుష చర్య అని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవా లని కోరారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు జి.కృష్ణ, పానుగంటి రామమూర్తి, అయిలా సొమనర్సింహాచారి, అంబాల శివనాథ్‌గౌడ్, గొలుసుల నర్సయ్య, పెట్లోజు సోమేశ్వరాచారి, నక్క సురేష్, గడ్డం మనోజ్‌కుమార్, రమేశ్, మల్యాల జనార్ధనాచారి, చిలుమోజు సాయికిరణ్, రంగరాజు ప్రసాద్, రామచంద్రం, డాక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.