
కొత్తవారికి మార్గనిర్దేశం చేయండి
జనగామ: వైద్యరంగంలోకి కొత్తగా వచ్చే వారికి మార్గనిర్దేశం ఐఎంఏ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్రునాయక్ అన్నారు. శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్‌లో ఐఎంఏ జనగామ శాఖ నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారమహోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా రాంచంద్రునాయక్ మాట్లాడుతూ ఐఎంఏలో పరస్పర సహకారం ఉండాలన్నారు. వృత్తిలో ఈర్ష్య, ద్వేశాలకు దూరంగా ఉంటూ సంఘటితంగా ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో వైద్యుల పాత్ర కీలకమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పని చేయాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ వైద్యులు ప్రత్యక్ష దైవస్వరూపులని అన్నారు. జిల్లా ఐఎంఏ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ బాలాజీ, కార్యదర్శిగా అమృతం శ్రీకాంత్‌తోపాటు కమిటీని ఎన్నుకోగా, ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ద్వారాకానాథరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ 1993లో ప్రారంభమైన జనగామ ఐఎంఏ రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐఎంఏ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ లవకుమార్‌రెడ్డి, డాక్టర్ జె.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ దయాల్ సింగ్, డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు, మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఏ.శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ పోకల జమునలింగయ్య, డాక్టర్లు సీహెచ్ రాజమౌళి, లక్ష్మీనారాయణ నాయక్, పి.సుగుణకర్ రాజు, రవీందర్‌గౌడ్, జి.గోపాల్ రెడ్డి, కల్నల్ భిక్షపతి, ఇన్నారెడ్డి, స్వప్న లింగమూర్తి, విజయలక్ష్మి, ప్రీతీదయాల్, ఎల్.అశోక్, స్వప్న రాథోడ్, రంజిత్ కుమార్, విజ్ఞశ్రీ, లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ కన్న పరశురాములు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్రు నాయక్