
వసతుల కల్పనకు కృషి
● హైకోర్టు జడ్జి జస్టిస్ అనిల్‌కుమార్
జనగామ రూరల్: జిల్లా కోర్టులో వసతుల క ల్పనకు కృషి చేస్తానని హైకోర్టు జడ్జి జస్టిస్ జె.అనిల్‌కుమార్ అన్నారు. శనివారం జిల్లా కో ర్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ పండరి చేతన్ నితిన్ ఆయనకు పూల మొక్క అందించి స్వాగతం పలి కారు. అనంతరం న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను జడ్జి దృష్టికి తీసుకువచ్చా రు. జిల్లా జడ్జి రవీంద్రశర్మ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలోని గుమాస్తా సంఘ భవనం, ఈసేవ, మహిళా బార్ అసోసియేషన్, లాకర్ రూంలను సందర్శించి పరిశీలించారు. అనంతరం జడ్జి జస్టిస్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా కోర్టులో క్యాంటీన్, జిరాక్స్ సెంటర్, మహిళా బార్ అసోసియేషన్‌కు హాల్ తదితర సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు. అ నంతరం కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి, న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు. నూతన బార్ అసోసియేషన్ సభ్యులు జడ్జిని శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్, తహసీల్దార్ హుస్సేన్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. హరిప్రసాద్ యా దవ్, జనరల్ సెక్రటరీ పి.రామకృష్ణ, సీనియర్ న్యాయవాదులు శ్రీరామ్ శ్రీనివాస్, జాన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సునీత రాణి పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు జడ్జి జస్టిస్ అనిల్‌కుమార్ జిల్లా జడ్జి రవీంద్రశర్మతో కలిసి శనివారం సందర్శించారు. కోర్టు హాల్, చాంబర్, బార్ అసోసియేషన్ హాల్, టాయిలెట్లను పరిశీలించారు. స్టేషన్‌ఘన్‌పూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకం రమేశ్ ఆధ్వర్యంలో జడ్జికి పలు సమస్యలతో కూడిన వినతులు అందించారు. సమస్యల పరిష్కారానికి జడ్జి సానుకూలంగా స్పందించారు.
పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం హైకోర్టు జడ్జి జస్టిస్ అనిల్‌కుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.