మహిళల హక్కుల పరిరక్షణలో కేంద్రం విఫలం
● ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి
జనగామ రూరల్: మహిళల హక్కుల పరిరక్షణలో కేంద్రం విఫలమైందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. ఈ మేరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర శనివారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా మహిళలు బస్టాండ్ చౌరస్తాలో ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పట్టణంలో ని నెహ్రూపార్క్ వద్ద ఇర్రి అహల్య అధ్యక్షతన ఏ ర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ రాజ్యాంగంలో సీ్త్ర పురుషులకు సమాన హక్కులు కల్పించబడ్డాయని, కానీ అసమానతలు ఇంకా తగ్గడం లేదన్నారు. జిల్లా అధ్యక్షురాలు అరుణ జ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి బుగ్గవేటి సరళ, ఆశాలత, సా యి లీల, జిల్లా కార్యదర్శి ఎండీ షబానా, భవాని, పి.కల్యాణి, బి.రమ, విజేందర్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి


