
తాగునీటి కొరత ఉండొద్దు
పాలకుర్తి టౌన్: నియోజకవర్గంలో వేసవిలో తాగునీటి కొరత లేకుండా చూడాలని ఎమ్మెల్యే యశ్వసినిరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఇరి గేషన్, మున్సిపల్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల నీటి నిల్వల వివరాలు, తొర్రూరు ట్యాంక్ బండ్ పనులు వేగవంతం చేయాలన్నారు. కాల్వల పూడికతీత సమస్య ప్రధానంగా ఉందని, పలు ప్రాంతాల్లో కాల్వల్లో భారీగా పూడిక పేరుకుపోవడంతో నీటి ప్రవాహం సక్రమంగా జరగడం లేదన్నారు.
రిజర్వాయర్ల పనులు వేగవంతం చేయాలి
ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి