
దేశ ప్రగతికే ప్రధాని ‘మన్‌కీ బాత్’
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేశ్
జనగామ రూరల్ : దేశ ప్రగతికే ప్రధా ని ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం చేపట్టార ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ‘మన్‌కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో నైపుణ్య మెళకువలు, చిన్న పరిశ్రమల స్థాపన, అలాగే రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేవిధంగా సేంద్రియ ఎరువుల వినియోగంపై, బడుగు బలహీన వర్గాలకు పారిశ్రామిక యూనిట్లు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహ న కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాయ ఎల్లయ్య, నాయకులు గుజ్జుల నారాయణ, భాగాల నవీన్‌రెడ్డి, యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి చింతకింది సంతోష్, కేశపురం రవిరాజా పాల్గొన్నారు.