వచ్చేస్తున్నాయ్..
జనగామ రూరల్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పనులు చేపడుతుంది. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులకు గతేడాది పాఠ్యపుస్తకాల ముద్రణ ఆలస్యంగా ప్రారంభం అయింది. దీంతో సకాలంలో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకోని వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు సమస్యలు రాకుండా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందించడానికి తగు చర్యలు తీసుకుంటుంది. ఇందుకు అవసరమైన పుస్తకాలు జిల్లాకు విడతల వారీగా అందిస్తున్నారు.
జిల్లాలో 2,78,310 పుస్తకాలు అవసరం
జిల్లాకు అవసరమైన పాఠ్యపుస్తకాలు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నాయి. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులందరికీ ఉచితంగా పుస్తకాలు అందజేయనున్నారు. మొత్తం 2,78,310 లక్షల పుస్తకాలు అవసరం ఉండగా ప్రస్తుతం మొదటి విడతగా 15,680 పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. 1 నుంచి 3వ తరగతి పుస్తకాలు కొంత తక్కువగా వచ్చాయి. 4 నుంచి 10వ తరగతి పుస్తకాలు వస్తున్నాయి. వీటి ని భద్ర పరిచేందుకు జిల్లా కేంద్రంలోని గోదాములు ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇండెంట్ పూర్తి కాగానే వాటిని ఆయా మండలాలకు పంపిణీ చేయనున్నారు. అక్కడ నుంచి పాఠశాలలకు సరఫరాల చేసి జూన్‌లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నారు.
క్యూఆర్ కోడ్‌తో ముద్రణ
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన కొనసాగుతుంది. విద్యార్థుఽలకు అన్ని విషయాలు అర్థం అయ్యే విధంగా ఇబ్బందులు పడకుండా ఉండాలని పాఠ్యపుస్తకాల్లో ఇంగ్లిష్, తెలుగు భాషల్లోనూ పుస్తకాలను ముద్రిస్తున్నారు. అలాగే పుస్తకాలపై క్యూఆర్ కోడ్‌తో ముద్రిస్తున్నారు. దీంతో పుస్తకాలు పక్కదారి పట్టకుండా ఉండే అవకాశం ఉంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా జిల్లా, మండలం, పాఠశాల పేరుతో ఆన్‌లైన్‌లో రానుంది. దీంతో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టే అవకాశం ఉండదు.
పునఃప్రారంభం రోజే పంపిణీ
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వి ద్యార్థులందరికీ జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభం రోజే పా ఠ్యపుస్తకాలు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాకు 16 వేలకు వరకు పుస్తకాలు వచ్చాయి. వాటిని గోదాముల్లో భద్రపరిచాం. మిగతావి వచ్చిన తర్వాత అన్ని మండలాలకు అందజేస్తాం. అలాగే విద్యార్థులకు నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందిస్తాం. సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. – రమేశ్, డీఈఓ
జిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాల వివరాలు
పాఠశాలల పునఃప్రారంభం రోజే
అందించేలా సన్నద్ధం
జిల్లాకు 2,78,310 లక్షల
పాఠ్యపుస్తకాలు అవసరం
మొదటి విడత చేరుకున్నవి 15,680
1వ తరగతి తెలుగు: 1,617
6వ తరగతి ఎస్‌ఎస్ తెలుగు మీడియం: 2,400
9వ తరగతి ఫిజికల్ సైన్స్: 937
4వ తరగతి ఎన్‌విరాన్‌మెంట్ సైన్స్: 50
8వ తరగతి ఇంగ్లిష్: 4,750
9వ తరగతి తెలుగు: 4,800
8వ తరగతి బయోసైన్స్
(తెలుగుమీడియం): 1,112
జిల్లాలో పాఠశాలల వివరాలు
జిల్లాలో 12 మండలాల్లో ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలు 504 ఉన్నాయి. ఇందులో 341 ప్రాథమిక పాఠశాలలు, 64 ప్రాథమికోన్నత పాఠశాలలు, 103 ఉన్నత పాఠశాలలు ఉండగా మొత్తం 35 వేలకుపైగా విద్యార్థులు ఉన్నారు.
వచ్చేస్తున్నాయ్..
వచ్చేస్తున్నాయ్..


