
కల్యాణం..రమణీయం
నవాబుపేట, వల్మిడిలో పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యేలు కడియం, యశస్వినిరెడ్డి
భక్తజనసంద్రంగా మారిన ‘జనగామ’
వేదపండితుల సమక్షంలో కోదండ రాముడి వివాహం
జనగామ: వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కల్యాణం ఆదివారం జిల్లా వ్యాప్తంగా కనుల పండువగా జరిగింది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య సీతారాముడి వివాహ వేడుకలు అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ నియోజకవర్గాలతో పాటు పట్టణంలోని పాతబీటు బజార్‌లో 72వ ఏట శ్రీ రాముడి పట్టాభిషేకం, కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. మహిళలు సీత మ్మ తల్లికి ఒడి బియ్యం పోసి, పట్టు వస్త్రాలను స మర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీ, మూలబావి శ్రీ హనుమత్ రామనాథ సహిత శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ మోహనకృష్ణ భార్గవ ఆధ్వర్యంలో రామనవమి వేడుకలు నిర్వహించారు. సాయంకాలం ఉత్సవ మూర్తులతో ఊరేగింపు నిర్వహించారు. జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. నవాబుపేటలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి మండలం వల్మిడి పుణ్యక్షేత్రంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి కల్యాణం వీక్షించారు.
– మరిన్ని ఫొటోలు 9లోu

కల్యాణం..రమణీయం

కల్యాణం..రమణీయం