ఆర్థిక ప్రగతికి సంఘాలు కృషి చేయాలి
జనగామ రూరల్: సహాకార సంఘాలు ప్రజల ఆర్థిక ప్రగతికి కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సహకార సంఘాల కార్యకలాపాల పనితీరును అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సహకార సంఘాల పరిధిలోని వివిధ వృత్తి కుటుంబాలను బలోపేతం చేసేందుకు గ్రామస్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతుసేవా సహకార సంఘాలు, పాల ఉత్పత్తుల సహకార సంఘాలు, మత్స్యసహకార సంఘాలు, కల్లుగీత కార్మిక సంఘాల ద్వారా విస్తృత సేవలు అందించాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత సేవలందించడానికి మరిన్ని సహకార సంఘాల ఏర్పాటు చేయాలన్నారు. రైతు ఉత్పత్తి కేంద్రాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకతను అధికారులతో సమీక్షిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. మత్స్యసహకార సంఘాలు, పాల ఉత్పత్తుల సహకార సంఘాలు తమ వ్యాపార పరిధిని పెంచుకొని సంబంధిత వృత్తి గ్రామీణ ప్రజలకు మరింత సేవలందించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ సరిత, జిల్లా సహకార శాఖ అధికారి రాజేందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్, జిల్లా మత్స్యశాఖ అధికారి రాణా ప్రతాప్, పశుసంవర్ధన శాఖ అధికారి రాధా కిషన్, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, విజయడైరీ అధికారి సత్యనారాయణ, డీసీసీబీ అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచాలి
స్టేషన్‌ఘన్‌పూర్: గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచేలా అధికారులు చూడాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్‌బాషా అన్నారు. మండలంలోని తానేదార్‌పల్లిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అధికారులతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. భూమిపూజ ఎప్పుడు చేశారు, మొరం, ఇసుక ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారని ఆరా తీశారు. కాగా, అక్కడే ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు వెంకన్న మాట్లాడుతూ.. ఇసుకతో సమస్య ఉందని, గోదావరి ఇసుక కొనాలంటే ప్రజలు ఇ బ్బంది పడుతున్నారని, లోకల్ ఇసుకకు అనుమతి ఇవ్వాలని లబ్ధిదారుల పక్షాన కోరారు. దీంతో కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ తహసీల్దార్‌కు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేస్తుందన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న గ్రామాల్లో నిర్మాణాలు త్వరగా పూర్తిచేసేలా అధికారులు బాధ్యతగా పనిచేస్తూ లబ్ధిదారులను చైతన్యం చేయాలన్నారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ పీడీ మాతృనాయక్, ఎంపీడీఓ విజయశ్రీ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీఓ నర్సింగరావు, పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ, నాయకులు మంతెన ఇంద్రారెడ్డి, పద్మారెడ్డి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
ఆర్థిక ప్రగతికి సంఘాలు కృషి చేయాలి


