
రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం
స్టేషన్‌ఘన్‌పూర్: సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని తానేదార్‌పల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తానేదార్‌పల్లి గ్రామస్తులు చాలా అదృష్టవంతులని, జనవరిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను ఈ గ్రామంలోనే ప్రారంభించినట్లు తెలిపారు. ఆయా సంక్షేమ పథకాల విషయంలో అధికారులు అప్రమత్తంగా, బాధ్యతగా పనిచేయాలన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతుభరోసాతో పాటు సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, డీఆర్‌డీఏ వసంత, డీఏఓ రామారావునాయక్, ఏఎంసీ చైర్‌పర్సన్ లావణ్యశిరీష్‌రెడ్డి, డీఎం సీఎస్ హతీరాం, గృహనిర్మాణ పీడీ మాతృనాయక్, ఎంపీడీఓ విజయశ్రీ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏపీఎం కుమారస్వామి, నాయకులు వెంకన్న, ఇంద్రారెడ్డి, పద్మారెడ్డి, కుమారస్వామి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. మండలంలోని విశ్వనాధపురంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్‌పర్సన్ లావణ్యశిరీష్‌రెడ్డి గురువారం ప్రారంభించారు.
అవినీతి రహిత పాలనే లక్ష్యం
అవినీతి రహిత పాలనే లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరితోపాటు కలెక్టర్ షేక్ రిజ్వాన్‌బాషా, అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా చూడాలని అధికారులకు చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి