
అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలి
● సీపీఎం ఆధ్వర్యంలో
కలెక్టరేట్ ఎదుట ధర్నా
జనగామ రూరల్: బాణాపురం ఇంది రమ్మ కాలనీ వద్ద బైపాస్ రోడ్‌పై అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలి.. ఈ విషయమై 11వ తేదీలోపు స్పష్టమైన ప్రకటన చేయకుంటే నేషనల్ హైవేను దిగ్బంధిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు హెచ్చరించారు. సోమవారం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ అధ్యక్షతన దీక్షా శిబిరం నుంచి కార్యకర్తలు, ప్రజలు పాదయాత్రగా కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేషనల్ హైవే అథారిటీ అధికారుల అనాలోచిత నిర్ణయం ఫలితంగా ప్రజలకు ప్రమాదం పొంచిఉందన్నారు. అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని 72 రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తూ.. ప్రజాప్రతినిధులు, ఎమ్మె ల్యే, ఎంపీలకు తెలిపినా పట్టించుకోవడంలేని అన్నా రు. అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం చేపడితే పదివేల మంది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు బొట్ల శేఖర్, బూడిద గోపి, సుంచు విజేందర్, బోడ నరేందర్, భూక్య చందు, చిట్యాల సోమన్న, ఎండీ.అజారుద్దీన్, బిట్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.