
రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జఫర్‌గఢ్: రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని, దేశంలో సన్నధాన్యానికి బోనస్ ఇస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మసీదు బండపై ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట కల్యాణలక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం 68 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 94 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తీగల కర్ణాకర్‌రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్‌రెడ్డి, నూకల ఐలయ్య, తహసీల్ధార్ శంకరయ్య, ఇల్లందుల బా బు, భూక్య సురేశ్ తదితరులు పాల్గొన్నారు.