
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
జనగామ రూరల్: వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అనంతరం సిద్దంకి, ఎల్లంల, పెంబర్తి గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన పంటలను వ్యవసాయశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎకరాకు రూ.10వేల చొప్పున నష్టపరిహారం అందించాలన్నారు. అలాగే మామిడి రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ బీనా, నాయకులు ఉన్నారు.
రైతులను ఆదుకుంటాం: డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ పరమైన సహాయం అందించేలా కృషి చేస్తానని డీసీసీ అధ్యక్షుడు కొ మ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పెంబర్తి, ఎల్లంల, సిద్ధంకి గ్రామాల్లో దె బ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతుల రెక్కల కష్టం నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన నష్టంపై నివేదిక సి ద్ధం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని రైతులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, రాజమౌళి, నిమ్మతి మహేందర్‌రెడ్డి, సుంకరి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి