
గొప్ప మానవతావాది జగ్జీవన్ రామ్
● అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్
జనగామ రూరల్: గొప్ప మానవతావాది బాబూ జగ్జీవన్ రామ్.. ఆయన ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల ని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. డాక్టర్ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శనివారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ వద్ద జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన వేడుకల్లో డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ నితిన్ చేతన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి తదితరులు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. అనంతరం సభలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జగ్జీవన్‌రామ్ రూపకల్పన చేసిన మహోన్నత వ్యవ స్థ కారణంగానే నేడు అట్టడుగున ఉన్న బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. ఆయన ఆశయాలను పుణికి పుచ్చుకొని ముందడుగు వేయాలన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ.. ప్రజల్లో సామాజిక పరమై న చైతన్యం తీసుకురావల్సిన అవసరముందని, విద్యార్థులను భాగస్వామ్యులను చేయాలన్నారు. జగ్జీవన్‌రామ్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి డాక్టర్ విక్రమ్, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, బీసీ సంక్షేమాధికారి రవీందర్, కార్మిక శాఖ అధికారి కుమారస్వామి, మున్సిపల్ కమిషన ర్ వెంకటేశ్వర్లు, కల్నల్ భిక్షపతి, డాక్టర్లు సుధాకర్, రాజమౌళి, ప్రీతి దయాళ్, ఉత్సవ కమిటీ సభ్యులు రాములు, రామంచందర్, మల్లిగారి రాజు, మధు, బోట్ల నర్సింగరావు, తిప్పారపు విజయ్, ప్రభాకర్, ధనలక్ష్మి, ధర్మభిక్షం, బోట్ల శేఖర్, కిషోర్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

గొప్ప మానవతావాది జగ్జీవన్ రామ్