
చివరి ఆయకట్టు వరకు నీరందించాలి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ రూరల్: దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎ మ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించా రు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశహాల్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, నీటి పారుదల శాఖ అధికారులతో దేవాదుల ఎత్తిపోతల పథకం కింద భూసేకరణ ప్రక్రియ, పెండింగ్ పనుల పురోగతి, సాగు నీటి సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారానే ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సాగుకు నీరు అందుతోందని యుద్ధప్రాతిపదికన దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. మల్లన్నగండి లిఫ్ట్ 1, 2 పనులను జులై లోగా పూర్తిచేసి, సాగు నీరు అందించాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీలు సుహాసిని, హనుమాన్ నాయక్, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మ న్ లావణ్య, మారుజోడు రాంబాబు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్, నీటి పారుదల శాఖ ఎస్ ఈలు, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.