
అక్రమ కేసులతో సబ్ జైళ్లు సరిపోతాయా!
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ: రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులపై అక్ర మ కేసులు బనాయిస్తూ పోతుంటే సబ్ జైళ్లు పరిపోతాయా? అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టును ఫా ర్వర్డ్ చేశారని బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు తిప్పారపు విజయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, బుధవారం జనగామ సబ్ జైలులో ఎమ్మెల్యే ములా ఖత్ ద్వారా ఆయనను పరామర్శించారు. అనంత రం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒక ఎమ్మెల్యేగా తనను కడియం శ్రీహరి బొచ్చు కుక్క అని తిడితే తప్పు లేదు కానీ, అది తప్పు అని వచ్చిన పోస్టును ఫార్వర్డ్ చేసిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం ఇదెక్కడి న్యాయమన్నారు. కడియం శ్రీహరిని దళిత జాతి క్షమించదన్నారు. ఎమ్మెల్యే వెంట పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్‌రెడ్డి, మసిఉర్ రెహమాన్, ఎండీ సమ్మద్, ముస్త్యాల దయాకర్, బాల్దె సిద్దిలింగం, యాదగిరిగౌడ్ తదితరులు ఉన్నారు.