అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
పాలకుర్తి టౌన్: జాతీయ అగ్నిమాపక భద్రతా వారోత్సవాల సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని క్లాత్‌స్టోర్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లో ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ సిస్టంపై పాలకుర్తి అగ్నిమాపక కేంద్ర అఽధికారి సీహెచ్ శ్రీరాములు ఆధ్వర్యంలో షాపింగ్ కాంఫ్లెక్స్ సిబ్బందికి అగ్ని ప్రమాద నివారణ భఽద్రత చర్యలు వివరించారు. అగ్ని ప్రమాదాలు నివారణపై అవగాహన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక కేంద్రం సిబ్బంది రామయ్య, నాగరాజు, అశోక్, ప్రశాంత్, ప్రదీప్‌కుమార్, మహేందర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


