
అవసరమైతే బ్లాక్ లిస్టులోకి..
– వివరాలు 8లోu
కూలి కూడా గిట్టడం లేదు..
నెలంతా పని చేస్తే రోజువారీ కూలి కూడా గిట్టడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో మురికి కాల్వ లు, వార్డులు శుభ్రం చేయడం.. చెత్త తరలింపు.. నీటి సరఫరా తదితర పనులు చేస్తున్నాం. వచ్చే అరకొర జీతంతో ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్నాం. వ్యవసాయ పనులకు పోదామంటే సమయం దొరకదు. పొద్దంతా ఇదే చాకిరి. అప్పు తెచ్చుకుని పూట గడుపుతున్నాం.
– బొల్లం లక్ష్మి, జీపీ కార్మికురాలు, వడ్లకొండ
కడియం రాజీనామా
చేసే వరకు వదలం
● భూ చెర పడుతున్న ఆంధ్రా అల్లుడు, బినామీలు
● జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
భూమి ఆక్రమించినట్లు నిరూపిస్తే రాజీనామా
● పట్టా భూములను రైతులకు
చెందాలనడం కబ్జా చేసినట్టా?
● ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హన్మకొండ: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణనీటి సరఫ రా, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్‌న్స్‌హాల్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథ శాఖ లపై శనివారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీతక్క మాట్లాడుతూ పనులు దక్కించుకోవడంలో చూపుతున్న శ్రద్ధ సకాలంలో పూర్తిచేయడంపై కాంట్రాక్టర్లు శ్రద్ధ చూపడం లేదన్నారు. ఇప్పటికీ మొదలుపెట్టని పనులకు తిరిగి టెండర్లు పిలవాలని సూచించారు. ఏళ్లుగా పనులు మొదలు పెట్టని, పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలన్నారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి పూర్తిచేయించే బాధ్యత ఎస్‌ఈలదే అని, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి వారికి సూచనలు చేయాలన్నారు. టెండర్లకు సిద్ధంగా ఉన్న రోడ్లకు వారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి సకాలంలో పనులు పూర్తి చేయించాలని చెప్పారు. నిధుల కొరత లేదని, పీఎంజీఎస్‌వై నిఽధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఇచ్చిందని వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం లేదు..
అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినవి ఇప్పటికీ పూర్తి చేయలేదని, తన పదవి కాలంలోపైనా పూర్తి చేస్తారా అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారుల ను ప్రశ్నించారు. తమ నియోజకవర్గాల్లో రోడ్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, రాంచంద్రునాయక్.. మంత్రి, ఈఎన్‌సీ కనకరత్నం దృష్టికి తీసుకెళ్లారు. పనులు పూర్తి చేయించడంలో అధికారులు వ్యవహరిస్తున్న వైఖరిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం..
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మహబూ బాబాద్ ఎంపీ బలరాంనాయక్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని, తాను ప్రతిపాదనలు పంపిన రోడ్లను మంజూరు చేయాలని ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఒక్కరే ఉన్నారని, అప్పుడు మీకు ప్రభుత్వం ఎంతగానో సహకరించిందని, ఇప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఒక్కడినే ఉన్నానని, నిష్పక్షపాతంగా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించి నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క కు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఎంపీ బలరాంనాయక్ కలుగజేసుకుని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తే తాము చెల్లిస్తున్నామన్నారు. దీంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇక్కడ రాజకీయాలు చేయడం మంచిది కాదని, రాజకీయాలు బయట చూసుకుందామన్నారు. సమావేశంలో ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
బాల్యవివాహాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి
బాల్య వివాహాల నిర్మూలనకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళ శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్‌లో మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషనర్ కాంతి వెస్లీతో కలిసి ఉమ్మడి జిల్లాలోని జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సీడీపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలోని మారుమూల గ్రామమైన రాయినిగూడెంలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఇష్టంగా తినే ఆహారంపై దృష్టి పెట్టాలన్నారు. బాల్య వివాహాలు జరగకుండా చూడడ మే అందరి లక్ష్యం కావాలన్నారు. ‘అమ్మమాట – అంగన్‌వాడీ బాట’ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది కూడా నిర్వహిస్తామని చెప్పారు.
పనుల్లో నిర్లక్ష్యం వహించే
కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క
పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథపై హనుమకొండ కలెక్టరేట్‌లో సమీక్ష
అభివృద్ధి పనుల తీరుపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అసంతృప్తి
ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉంటున్నాయని అధికారులపై అసహనం

అవసరమైతే బ్లాక్ లిస్టులోకి..