
అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే కృషి
హన్మకొండ: అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త జ్యోతిబా పూలే అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో జ్యోతిబా పూలే జయంతిని నిర్వహించారు. ఈసందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎండీ మాట్లాడుతూ.. కులం పేరుతో తరతరాలుగా అణిచివేతకు గురైన ప్రజలకు ధైర్యం కల్పించిన వ్యక్తి పూలే అని కొనియాడారు. సీ్త్రలు అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని, సీ్త్ర విద్య కోసం పోరాడిన గొప్పసంస్కర్త జ్యోతిబా పూలే అన్నారు. 1873 సెప్టెంబర్ 24న సత్యశోధన సమాజాన్ని స్థాపించారని, పూలే కేవలం కులవ్యవస్థ రూపు మాపడమే కాకుండా సామ్రాజ్యవాద వ్యతిరేక, కార్మికవర్గ, రైతాంగ పక్షంగా పోరాడారని వివరించారు. పూలే జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సీఈలు కె.తిరుమల్‌రావు, రాజుచౌహాన్, రవీంద్రనాథ్, బికంసింగ్, వెంకటరమణ, జాయింట్ సెక్రటరి కె.రమేష్, జీఎంలు అన్నపూర్ణ, వేణుబాబు, వాసుదేవ్, నాగ ప్రసాద్, శ్రీనివాస్, మల్లికార్జున్, దేవేందర్, కృష్ణ మోహన్, గిరిధర్, సత్యనారాయణ, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం పాల్గొన్నారు.
గొప్పసామాజిక సంఘ సంస్కర్త
కేయూ క్యాంపస్: మహాత్మాజ్యోతిబా పూలే గొప్ప సామాజిక సంఘసంస్కర్త అని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పూలే జయంతిని యూనివర్సిటీలోని సెనెట్ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్య ద్వారానే అసమానతలు తొలగిపోతాయని విద్యా ప్రాధాన్యతను పూలే ఆనాడే చాటిచెప్పారన్నారు. పూలేను స్ఫూర్తి, ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కాన్సిటిట్యూషన్ రెలవెన్స్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ అండ్ ఎడ్యూకేషనల్ ఇంప్లికేషన్ ఆన్ బీసీస్ ఇన్ తెలంగాణ అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సీహెచ్ శ్రీనివాస్ కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు సిరికొండ సంజీవరావు, కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడారు. పాలకమండలి సభ్యులు ఆచార్య సురేష్‌లాల్, డాక్టర్ అనితారెడ్డి, మల్లం నవీన్, సుకుమారి, చిర్ర రాజు, పుల్లూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత కేయూ దూరవిద్యా కేంద్రంలోని పూలే దంపతుల విగ్రహాలకు వీసీ, రిజిస్ట్రార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బోధన, బోధనేతర సిబ్బంది, పలువురు పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి

అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే కృషి