
మళ్లీ సమ్మెబాట!
వనజీవికి నివాళి
ఆదివారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
జనగామ రూరల్: గ్రామాల అభివృద్ధేతోనే దేశ ప్రగతి.. పల్లెలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు.. మురికి కాల్వలు, వార్డులు శుభ్రం చేయడం.. చెత్త తరలింపు.. నీటి సరఫరా.. కరెంటు సమస్యల పరిష్కారం.. ఇలా పొద్దంతా అన్ని రకాల పనులతో చాకిరీ చేస్తున్న గ్రామ సేవకులకు ఇచ్చేది అరకొర వేతనమే. అదికూడా సమయానికి అందక కుటుంబాలు గడవక పడరాని పాట్లు పడుతున్నారు. డిమాండ్ల సాధనకు గతంలో సమ్మె చేయగా.. కంటి తుడుపుగా కొన్ని హామీలు ఇచ్చిన పాలకులు చేతులు దులుపుకున్నారు. అయి తే గత ఐదు నెలల నుంచి వేతనాలు రావడంలేదు. దీంతో మళ్లీ సమ్మె బాట పట్టేందుకు పంచాయతీ కార్మికులు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే యూనియన్ నాయకులు అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు.
1,210 మంది జీపీ కార్మికులు
జిల్లాలో 281 గ్రామ పంచాయితీలు ఉండగా 1,210 మంది జీపీ కార్మికులు మల్టీపర్పస్ విధులు నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వర్కర్ల సంఖ్య లేదు. 25 శాతం తక్కువగా ఉన్నా రు. అదనపు పనిభారం పడుతోంది. గ్రామ పంచా యతీల్లో మల్టిపర్పస్ విధానం కారణంగా అన్ని రకాల పనులు చేయించడంతో కార్మికులకు కష్టాలు తప్పడంలేదు. ప్రదాకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న వీరికి అరొకరగా చెల్లించే రూ.9,500 వేతనం నెలల తరబడి అందక కుటుంబాలు గడవక అప్పులు చేస్తూ కాలం గడుపుతున్నారు. మల్టీపర్పస్ విధానం కార్మికుల ప్రాణాల మీదికి వస్తోంది. రెండు రోజుల క్రితం రఘునాథపల్లి మండలం మేకలగట్టుకు చెందిన కారోబార్ వేల్పుల నాగరాజు విద్యుత్ సమస్య పరిష్కారం కోసం స్తంభం ఎక్కవగా విద్యుత్ షాక్ గురయ్యాడు.
జీపీ కార్మికుల డిమాండ్లు ఇవీ..
● పర్మనెంట్ చేసి రేగ్యులర్‌గా వేతనం చెల్లించాలి.
● జీఓ 60 ప్రకారం స్వీపర్లకు రూ.15,600, బిల్ కలెక్టర్, కారోబార్లకు రూ.19,500 చెల్లించాలి.
● జీఓ 51ని సవరించి మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి.
● ప్రతి కార్మికుడికి ప్రమాద బీమా రూ.10 లక్షలు, దహన సంస్కారాలకు రూ.20 వేలు ఇవ్వాలి.
● రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలి.
● అనారోగ్యంతో మరణిస్తే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
● ఏడాదికి కార్మికులకు మూడు జతల యూ ని ఫామ్, చెప్పులు, సబ్బులు, నూనెల కొనుగో లుకు నగదు రూపంలో అలవెన్స్ చెల్లించాలి.
● ప్రతి కార్మికుడికి ఈఎస్‌ఐ, పీఎఫ్ సదుపాయం కల్పించి ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలి.
● కార్మికుల అక్రమ తొలగింపులు ఆపి ఉద్యోగ భద్రత కల్పించాలి.
న్యూస్‌రీల్
గ్రామసేవకులపై పట్టింపేది..?
ఐదు నెలలుగా అందని వేతనాలు
కుటుంబాలు గడవక ఇబ్బందులు
కనీసవేతనం, ఉద్యోగ భద్రత కరువు
తిరిగి సమ్మెబాట పట్టనున్న కార్మికులు..!
అధికారులకు సమ్మె నోటీసులు
అందజేసిన కార్మిక నాయకులు

మళ్లీ సమ్మెబాట!

మళ్లీ సమ్మెబాట!