
ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించాలి
జనగామ రూరల్: ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతీరోజు కేంద్రాలను పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ రోహిత్ సింగ్ ఆదేశించారు. మంగళవారం జనగామ మండలం పెంబర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓపీఎంఎస్‌లో వివరాలను నమోదు చేయాలన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పౌరసరఫరాల శాఖ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి సరస్వతి, సహకార శాఖ అధికారి రాజేందర్ రెడ్డి, డీఎం మేనేజర్ హథిరాం తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్