
జనగామ
మంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
7
పక్క ఫొటోలో తన నానమ్మ(కమలమ్మ) వద్ద ఉన్న బాలుడి పేరు బండి అఖిల్(09). ఇతడికి పుట్టుకతోనే మానసిక పరిస్థితి బాగోలేదు. బయటకు వెళ్లాలంటే ఎవరైనా తోడుండాల్సిందే. బచ్చన్నపేట మండల అలీంపూర్‌కు చెందిన కమలమ్మ కుమారుడు బండి అజయ్‌కి ఇద్దరు కుమారులు. అతను కూలీ పనులకు వెళ్లి పిల్లలను పోషించుకుంటున్నాడు. తల్లి కమలమ్మ వారి బాగోగులు చూసుకుంటోంది. దివ్యాంగుడైన అఖిల్‌కు సదరం క్యాంపులో 2024 ఫిబ్రవరిలో వందశాతం వైకల్యంతో సర్టిఫికెట్ ఇచ్చారు. ఏడాది దాటిపోయినా ఇప్పటి వరకు పింఛన్ మంజూరు కాలేదు. ‘మనవడిని తీసుకుని గ్రీవెన్స్‌కు, అధికారుల వద్దకు తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది’ అని కమలమ్మ వాపోయింది. పింఛన్ వచ్చేలా చూడాలని అర్జీ పెట్టుకుంది.
న్యూస్‌రీల్

జనగామ

జనగామ

జనగామ