
పిల్లల మానసిక ఎదుగుదలకు చర్యలు
స్టేషన్‌ఘన్‌పూర్: పిల్లల మానసిక ఎదుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధీర్ అన్నారు. రాష్ట్రీయ బాలస్వస్థ్య కార్యక్రమంలో భాగంగా కమిషనరేట్ ఫ్యామిలీ వెల్ఫేర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు స్థానిక జెడ్పీఎస్‌ఎస్‌లోని అంగన్‌వాడీ కేంద్రం–2లో మంగళవారం శిశువుల మానసిక ఎదుగుదల లోపాలను గుర్తించుట, దృష్టి లోపాలను గుర్తించుటకు ఆర్‌బీఎస్‌కే స్టేషన్‌ఘన్‌పూర్ టీం బృందంచే 121 మంది పిల్లలకు నిర్ధేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. పిల్లల మానసిక ఎదుగుదల, దృష్టి లోపాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారం అందించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ పద్మజ, డా క్టర్ అజయ్‌కుమార్, శ్రీనాథ్, ఆఫ్రీన్, మౌనిక, ఏ ఎన్‌ఎం రాణి, సూపర్‌వైజర్ సంధ్యారాణి, అంగన్‌వాడీ టీచర్ రాణి తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్