జిల్లా సమాఖ్యకు పెట్రోల్‌బంక్!
● 10 గుంటల భూమికి ప్రపోజల్
● సెర్ప్ నుంచి నిధులు
జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో మరో పెట్రోల్‌బంకు రాబోతుంది. జిల్లా సమాఖ్యకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి స్థల పరిశీలన పూర్తి కాగా, ప్రపోజల్స్ సర్కారుకు పంపించారు. రాష్ట్రంలో నారాయణపేట్‌లో సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్‌బంక్ రన్నింగ్ అవుతుండగా.. రెండవ బంకు జనగామకు రానుంది. పట్టణంలోని సిద్దిరోడ్డు వైపు స్థలంకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా... సర్కారు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. రూ.కోటి నిధులతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను సెర్ఫ్ ఉంచి ఇవ్వనున్నారు. ప్రభుత్వం నుంచి భూ కేటాయింపులు పూర్తయిన వెంటనే పెట్రోలు బంకు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.


