
వణికిస్తున్న వరుణుడు
శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోu
జనగామ: రైతన్నలకు వరుణుడు వణుకుపుట్టిస్తున్నాడు. యాసంగి సీజన్‌లో కరువు నష్టాన్ని మిగిల్చితే.. ఉన్న కాసింత పంటను అమ్ముకుందామంటే ప్రకృతి కన్నెర్ర చేస్తూ ఆగం చేస్తోంది. గాలి దుమారం, అకాల వర్షం భయంతో పచ్చిమీదనే రైతులు పంటను కోస్తున్నారు. తీరా.. పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వెళితే.. వర్షం భయం వెంటాడుతోంది. గడిచిన మూడు రోజులుగా గాలి దుమారం, చిరుజల్లులతో అన్నదాతలు అతలాకుతలం అవుతున్నారు.
వాతావరణ మార్పులు..
ఎండాకాలంలో వాతావరణం గతితప్పిందా అన్నట్లుగా.. పరిస్థితులు మారుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 38 డిగ్రీల ఉష్ణోగ్రతలతో భగ్గున మండిపోతుండగా, సాయంకాలం వాతావరణం చల్లబడిపోతుంది. దీంతో కోతకోసి మార్కెట్‌కు తీసుకొచ్చిన ధాన్యం ఎండిన తర్వాత, మళ్లీ తడుస్తుంది. దీంతో క్వింటా ధాన్యం రూ.200 నుంచి రూ.400 తక్కువకు విక్రయించే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
తగ్గిన దిగుబడి..
జిల్లాలో యాసంగి సీజన్‌లో 1.80లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులు, ఎండిన చెరువులతో భూగర్భ జలాలు అడుగంటి 30 శాతం మేర పంటలు ఎండిపోయాయి. దీంతో దిగుబడి తగ్గిపోయింది. ప్రస్తుతం చాలాచోట్ల మరో పదిరోజుల తర్వాత కోతలు మొదలు పెట్టాల్సి ఉంది. కానీ అకాల వర్షం భయంతో పచ్చి కోతలు చేపట్టడంతో సరాసరి మిగులుబాటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
జనగామ మార్కెట్‌లో తడిసిన ధాన్యం
జిల్లాలో గురువారం కురిసిన వర్షంతో కల్లాలు, మార్కెట్‌లో ఉన్న ధాన్యం తడిసింది. జనగామ మార్కెట్‌తోపాటు కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం రాసులు తడిసి పోగా, కొంతమేర ధాన్యం కొట్టుకుపోయింది. వరదలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులుపడ్డారు. గాలిదుమారం ప్రారంభం కాగానే, ధాన్యం రాసులపై టారాల్పిన్ కవర్లు కప్పి ఉంచినా, స్వల్ప నష్టం జరిగింది. పొద్దంతా ఎండిన ధాన్యం తడిసిపోవడంతో తేమ శాతం పెరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
బండపై ధాన్యాన్ని ఆరబోశా..
మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి సాగు చేశా. సుమారు రూ.75వేలకు పైగా పెట్టుబడి పెట్టిన. సాగునీరు అందక 25 శాతంమేర నష్టపోగా, ఉన్న పంటకు నీటిని అద్దెకు తీసుకుని కాపాడాను. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పచ్చిమీదనే పంట కోసిన. ధాన్యాన్ని బండపై ఆరబోశాను. మబ్బులు చూస్తుంటే గుబులు పుడుతుంది.
– సముద్రాల యాకయ్య, రైతు, జఫర్‌గఢ్
న్యూస్‌రీల్
ఉదయం ఎండలు..
సాయంత్రం గాలులు
ముమ్మరంగా కోతలు.. కల్లాల్లో ధాన్యం
జిల్లాలో తగ్గిన దిగుబడి..
మార్కెట్‌లో తడిసిన ధాన్యం

వణికిస్తున్న వరుణుడు

వణికిస్తున్న వరుణుడు

వణికిస్తున్న వరుణుడు

వణికిస్తున్న వరుణుడు

వణికిస్తున్న వరుణుడు