సరస్వతీ పుష్కరాల్లో ‘జ్ఞానతీర్థం’ శోభ | - | Sakshi
Sakshi News home page

సరస్వతీ పుష్కరాల్లో ‘జ్ఞానతీర్థం’ శోభ

Apr 6 2025 1:12 AM | Updated on Apr 6 2025 1:12 AM

సరస్వ

సరస్వతీ పుష్కరాల్లో ‘జ్ఞానతీర్థం’ శోభ

పుష్కరఘాట్‌కు కాకి, హంస, మకరం

చిత్రాలతో కూడిన రాయి రెయిలింగ్‌

కాళేశ్వరం: జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మే 15 నుంచి 26 వరకు నిర్వహించే సరస్వతి పుష్కరాల్లో జ్ఞానతీర్థం (ఆహ్వాన విగ్రహం) ఏర్పాటు చేయనున్నారు. పుష్కరాల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25కోట్ల నిధులు మంజూరు చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర దేవాదా యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌ పలుమార్లు చేసిన సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో పనులు ఊపందుకున్నాయి. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ప్రత్యేక దృష్టి సారించడంతో పనుల్లో వేగం పెరిగింది. సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం రూ.20 లక్షలతో ‘జ్ఞానతీర్థం’ ఎఫ్‌ఆర్‌పీ ఫైబర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాళపత్ర గ్రంథాలతో రెండు చేతుల్లో దీపం వెలిగి ప్రకాశించేలా ఫైబర్‌ విగ్రహం నిర్మాణం చేయనున్నా రు. దీని నమూనా చిత్రాలను ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్లు తయారు చేశారు. ఈ విగ్రహం ఉద్దేశం ఏమిటంటే.. పూర్వం కాకి నదిలో స్నానం చేసి హంసలాగా మారి జ్ఞానం పొందింది. అలా ఇక్కడి నదిలో స్నా నం చేసిన భక్తులు జ్ఞానాన్ని పొందుతారని సారంశంగా, భక్తులను ఆహ్వానించేలా ఉండే విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. అదేవిధంగా జ్ఞానతీర్థం (వీఐపీ) ఘాట్‌ రెయిలింగ్‌ను కాకి, హంస, మకరం చిత్రాలను రాతిపై చెక్కి అమర్చనున్నారు.

సరస్వతీ పుష్కరాల్లో ‘జ్ఞానతీర్థం’ శోభ1
1/1

సరస్వతీ పుష్కరాల్లో ‘జ్ఞానతీర్థం’ శోభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement