
హామీల అమలులో విఫలం
జఫర్‌గఢ్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చేసిన ఏ వాగ్ధానం కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతోందన్నారు. మండల అధ్యక్షుడు కోరుకొప్పుల గణేష్‌గౌడ్, అంజిరెడ్డి, మదన్‌మోహన్, తౌటి సురేష్‌గౌడ్, గడ్డం రాజు, మారపల్లి రవి, మేకల పవన్, సంగా గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
అవకాశవాద రాజకీయాలు
చేస్తున్న ఎమ్మెల్యే కడియం
స్టేషన్‌ఘన్‌పూర్: స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. ఘన్‌పూర్ డివిజన్‌కేంద్రంలో బీజేపీ మండలస్థాయి క్రియాశీల సభ్యుల సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సట్ల వెంకటరమణగౌడ్, పార్లమెంట్ కోకన్వీనర్ ఇనుగాల యుగేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేశ్