
ఉపాధ్యాయుల ఉద్యమ దిక్సూచి యూటీఎఫ్
● రాష్ట్ర కార్యదర్శి రంజిత్‌కుమార్
స్టేషన్‌ఘన్‌పూర్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఉద్యమ దిక్సూచి టీఎస్‌యూటీఎఫ్ అని రాష్ట్ర కార్యదర్శి కా నుగంటి రంజిత్‌కుమార్ అన్నారు. యూటీఎఫ్ ఆవి ర్భావ దినోత్సవం సందర్భంగా ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో ఆదివారం యూటీఎఫ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా రంజిత్‌కుమార్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగ సంక్షేమం కోసం, ఉపాధ్యాయుల హక్కుల కోసం కట్టుబడి అనేక ఉద్యమాలు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న ఐదు విడతల కరువు భత్యాన్ని వెంటనే చెల్లించాలని, వేతన సవరణ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డి మాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాష్, చిక్కుడు శ్రీనివాస్, కోరుకొప్పుల రాజు, కుసుమ రమేష్, తాడూరి సుధాకర్, బానోతు వసంత్‌నాయక్, అడికె సతీష్‌కుమార్, పిట్టల మహేందర్ పాల్గొన్నారు.