
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తి/దేవరుప్పుల: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కు అండగా నిలిచి వారి కష్టాలను తీర్చుతున్నదని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం పాలకుర్తి మండల పరిధి ముత్తారం, లక్ష్మీనారాయణపు రం, దేవరుప్పుల మండల కేంద్రంలోని కొత్తకాల నీ, నీర్మాల గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రైతులకు ఏకకాలంలో రుణమాపీ, ఉచిత కరెంటు అందించడంతోపాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వరి దిగుబడి పెరిగిందని, దళారులకు తక్కువ ధరకు విక్రయించి మోసపోకుండా ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇస్తున్న రూ.500 బోనస్‌ను సద్వినియోగం చేసుకో వాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ వసంత, ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మంజుల భాస్కర్, టీపీసీసీ సభ్యుడు డాక్టర్ ఎల్.లక్ష్మీనారాయణనాయక్, ఎంపీడీఓ రాములు, తహసీల్దార్ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం పిట్టల నరేందర్, పార్టీ నాయకుడు నల్ల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.