ప్రజలకు కాపలా కుక్కలా పనిచేస్తా..
జనగామ: ‘నియోజకవర్గ ప్రజలకు కాపలా కుక్కలా పనిచేస్తా.. కడియం శ్రీహరిలా నేను గుంట నక్కను కాదు’ అంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్టేషన్‌ఘపూర్‌కు మున్సి పాలిటీ, డిగ్రీ కాలేజీ, లిఫ్ట్ ఇరిగేషన్, 100 పడకల ఆస్పత్రి, నవాబ్‌పేటకు లైనింగ్‌ను కడియం శ్రీహరి నాడు ఆపేసి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడని అన్నారు. అభివృద్ధిని ఆపే చరిత్ర వాళ్లదైతే.. పనులు చేసే చరిత్ర తమదని పేర్కొన్నారు. కడియం తనను బొచ్చు కుక్క అంటూ మాట్లాడారు.. అవును నేను కుక్కనే.. నా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారిని కాపాడేందుకు కాపలా కుక్కగా ఉంటానే తప్ప.. ఆయనలా గుంట నక్క వేశాలు మాత్రం వేయనని అన్నారు. ముసలితనానికి వచ్చి న కడియం.. అటవీ భూముల మీద కన్నేశాడని, వాటిని కాపాడేందుకు నేను రేసు కుక్కలా పరుగెత్తుతానని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించే వరంగల్ సభను అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు. 2001లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా బహిరంగ సభలకు అనేక అడ్డంకులు తలపెట్టినా ఎక్కడా ఆగలేదన్నారు. ప్రతీ కార్యకర్త కథానాయకుడిగా మారి ప్రజా వ్యతి రేఖ పాలన సాగిస్తున్న కాంగ్రెస్‌ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎంపీపీలు మేక కలింగరాజు, భైరగోని యాదగిరి గౌడ్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, జయ ప్రకాశ్‌రెడ్డి, కాస భాస్కర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
కడియం లాగా గుంట నక్కను కాదు
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి


