పాలకుర్తి సమ్మక్క, సారక్కలు ఎలా ఉన్నారు..
పాలకుర్తి టౌన్: పాలకుర్తి సమ్మక్క, సారక్కలు ఎలా ఉన్నారు...చెల్లి యశస్వినిరెడ్డి బాగున్నవా... అక్క ఝాన్సీరెడ్డి బాగున్నవా.. ఆడబిడ్డలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆత్మీయ పలకరింపు. ఆదివారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా సీఎం రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఝాన్సీరెడ్డి కలిశారు. పాలకుర్తి నియోజవర్గ అభివృద్ధి, ప్రాజెక్టులు, తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధిపై సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తొర్రూరు పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు కేటాయించాలని సీఎం కోరారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించి నియోజవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీఎంను కలిసిన వారిలో వరంగల్ మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ లకావత్ ధన్వంతి, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ తదితరులు ఉన్నారు.
యశస్వినిరెడ్డి, ఝాన్సీరెడ్డిని ఆత్మీయంగా పలకరించిన సీఎం


