
విద్యుత్ ప్రమాదాలకు చెక్
జనగామ: విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించడంతో పాటు తరుచూ సంభవిస్తున్న ప్రమాదాలను నివారించేందుకు ఎన్పీడీసీఎల్ ఆన్‌లైన్ ఎల్‌సీ(లైన్ క్లియ ర్) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు యాప్ సేవలపై సంస్థ ఎస్‌ఈ వేణుమాధవ్ శనివారం సర్కిల్ కార్యాలయం నుంచి సంబంధిత ఏఈలు, అధికారులు, ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విద్యుత్ నిలిపి వేసే సమయంలో ఎల్‌సీ తీసుకుని మరమ్మతు పనులు చేపట్టే క్రమంలో జరుగుతున్న మానవ తప్పిదా లను నిరోధించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. ఏఈ అనుమతి లేకుండా ఎల్‌సీ తీసుకునే పరిస్థితి ఉండదని, లైన్‌మెన్ యాప్ ఓపెన్ చేసి ఎల్‌సీ కోసం ఏఈకి రిక్వెస్ట్ పెట్టుకుంటే.. ఇవ్వొచ్చా, ఇవ్వొద్దా అనే విషయం ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఏఈ ఎల్‌సీకి అనుమతిచ్చిన వెంటనే లైన్‌మెన్‌కు యాప్ ద్వారా మెసేజ్ చేరగా.. ఏ ఫీడర్‌కు ఇవ్వాలనే విషయం సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు సైతం వెళ్తుందన్నారు. విద్యుత్ లైన్ మరమ్మతు పూర్తయిన వెంటనే ఆ పనికి సంబంధిచి ఫొటోను యాప్‌లో అప్‌లోడ్ చేసి ఎల్‌సీ రిటర్న్ చేస్తే ఆ సమాచారం ఏఈకి వెళ్తుందన్నారు. ఇదిలా ఉండగా.. ఆపరేటర్ ఎల్‌సీ ఇచ్చే సమయంలో జరిగే పొరపాట్లను సరిచేసుకునేలా యాప్ ఎపటికప్పుడు తెలియజేస్తుందని చెప్పారు. ఎక్కడైనా డబుల్ ఫీడింగ్, దీనికి వేరే ఫీడర్‌తో అనుసంధానం కలిగి ఉందా.. లేదా.. ఇతర వాటితో క్లియరెన్స్ ఎలా ఉంది.. అనే విషయమై యాప్ హెచ్చరిక చేస్తుందని వివరించారు. ఆపరేటర్ జాగ్రత్తలు, నియమ నిబంధనలకు సంబంధించి ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించారు.
అందుబాటులోకి ఆన్‌లైన్ ‘ఎల్‌సీ’ యాప్
ఏఈ అనుమతి మేరకే లైన్ క్లియరెన్స్
ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్