
ఆదర్శప్రాయుడు మహాత్మాజ్యోతిబా పూలే
జనగామ రూరల్: ఆదర్శప్రాయుడు మహాత్మా జ్యోతిబా పూలే, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అ న్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో పూలే 199వ జయంతిని ఘ నంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ పాల్గొని జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక ఉద్యమకారుడిగా, కుల వివక్షతకు వ్యతిరేకంగా అన్ని వర్గాల సమానత్వానికి పాటుపడిన మహనీయుడన్నారు. సమానత్వం లేని కాలంలో సత్య శోధక్ సమాజ్‌ను ఏర్పాటు చేసి సమానత్వానికి ఎంతగానో కృషి చేశారన్నారు. అంతకుముందు సమాచార పౌరసంబంధాల శాఖ ఆ ధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా కారుల బృందాలచే పూలే గొప్పతనాన్ని పాటల ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రవీందర్, డీఎస్సీ డీఓ విక్రమ్, జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు వెంకట మల్లయ్య, వేముల బాలరాజ్, నారోజు రామేశ్వర చారి, జామ మల్లేష్, బాల్డే మల్లేశం, శివరాత్రి దు ర్గయ్య, శివరాత్రి కుమార్, కడారి రమేష్, జూకంటి శ్రీశైలం, మామిడల రాజు, మంగ రామకృష్ణ, కన్నా పరశురాములు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా