
వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
జనగామ రూరల్: హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు అన్నారు. మంగళవారం యూనియన్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం రాపర్తి రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాల రద్దుకు మే 20వ తేదీన జాతీయ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని, హమాలీ కార్మికుల పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి యాటల సోమన్న, సుంచు విజేందర్, అన్నేబోయిన రాజు, తాండ్ర ఆనందం, సుంకు రాజు, గజ్వేల్ రమేశ్, బి.భాస్కర్, పోతం మధు, మంగ నరసింహ, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు