బఫర్ గోదాంలో రేషన్ బియ్యం తనిఖీ
జనగామ: తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ నేపధ్యంలో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఓఎస్‌డీ ప్రభాకర్, మేనేజర్ లక్ష్మారెడ్డి శుక్రవారం జిల్లా కేంద్రంలోని బియ్యం నిల్వ చేసే బఫర్ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సివిల్ సప్లయీస్ డీఎం హతిరామ్, లీగల్ మెట్రాలజీ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్, సివిల్ సప్లయీస్ నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్‌తో కలిసి గోదాంతో పాటు పట్టణంలోని 11, 13 నంబర్ రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. అధికారులు, క్వాలిటీ, క్వాంటిటీ పరిశీ లన చేసిన తర్వాత ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు పంపిస్తారు. అక్కడ నుంచి రేషన్ దుకాణాలకు లిఫ్టు చేస్తారు. ఈ నేపధ్యంలో రేషన్ దకాణాలకు పంపించే 50 కిలోల బి య్యం బ్యాగులో తూకం తేడా వస్తుందని సాక్షి మెయిన్ పేజీలో ఈ నెల 4న ప్రచురితమైన కథనంతో అధికారులు స్పందించారు. గోదాం, రేషన్ దుకాణాల్లో బస్తాలను తూకం వేసి హెచ్చుతగ్గులను పరిశీలించారు. ఎక్కడ కూడా ఎలాంటి తేడాలు లేవని నిర్ధారణ చేసుకున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.


