
ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం..
● వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు
జనగామ: అకాల వర్షంతో నష్టపోయిన పంటల వివరాలను ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు తెలిపారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు సోమవారం జనగామ మండలం పెంబర్తి, సిద్దెంకి, చిల్పూర్, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, లింగాలఘణపురం, తరిగొప్పుల మండలాల పరిధిలో వడగళ్ల వర్షంతో నష్టపోయిన మామిడి తోటలు, వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి రామారావు, హార్టీకల్చర్ అధికారి శ్రీధర్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. రైతుల వారీగా పూర్తి సమగ్ర నివేదికను తయారు చేసి సమర్పించాలని వ్యవసాయ విస్తరణ అధికారులను ఆదేశించారు. వారి వెంట ఏడీఏ వసంత, ఏఓ వెంకటేశ్వర్లు, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.
అగ్నిప్రమాదాలపై
అప్రమత్తంగా ఉండాలి
పాలకుర్తి టౌన్: అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక కేంద్రం అధికారి శ్రీరాములు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని లక్ష్మినర్సింహస్వామి ఆలయంలో వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఎండాకాలంలో సంభవించే అ గ్నిప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక కేంద్రం సిబ్బంది రామయ్య, నాగరాజు, అశోక్, ప్రశాంత్, ప్రదీప్‌కుమార్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం..