శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

Published Sat, Apr 12 2025 2:28 AM | Last Updated on Sat, Apr 12 2025 2:32 AM

10లోu

వైభవంగా పారువేట

పాలకుర్తి టౌన్‌: తెలంగాణ రెండో భద్రాద్రిగా వెలుగొందుతున్న వల్మిడీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజున స్వామి వారికి బండ్లు తిరుగుట, పారువేట నిర్వహించారు. అలాగే శుక్రవారం రాత్రి నిర్వహించిన శ్రీపుష్పయాగం, దోపోత్సవం, ద్రజారోహణం కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

జీఓ 129ని సవరణ చేయాలి

జనగామ రూరల్‌: జీఓ 129ని సవరించాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెద్దాపురం రమేశ్‌ అన్నారు. శుక్రవారం పెండెల శ్రీనివాస్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం యూని యన్‌ కార్యాలయంతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఓనంబర్‌ 129 ద్వారా గ్రామ రెవెన్యూ అధికారులు చాలా నష్ట పోతున్నామని, సుమారు 20 నుంచి 25 సంవత్సరాల నుంచి సర్వీస్‌ చేసిన వారికి అవకాశం కల్పించకపోవడం బాధాకరమన్నారు. అనంతరం కలెక్టర్‌ రిజ్వన్‌ బాషాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నామల పరుశరాములు, రవీందర్‌, యాదగిరి, సుదీర్‌ రెడ్డి నరేష్‌, శ్రీకాంత్‌, కొండ య్య, క్రాంతి, షకీల్‌, సాంబయ్య, గంగరాజు, రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.

గోపా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా సతీష్‌గౌడ్‌

స్టేషన్‌ఘన్‌పూర్‌: గోపా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని ఇప్పగూడెం గ్రామానికి చెందిన మందపురం సతీష్‌గౌడ్‌ను నియమించినట్లు గోపా (గౌడ అఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెసనల్స్‌ అసోసియేషన్‌) యువజన రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొప్పుల నాగేష్‌గౌడ్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సతీష్‌చేసిన సేవలను గుర్తించి యువజన అధ్యక్షుడిగా నియమించామన్నారు. అనంతరం సతీష్‌గౌడ్‌ మాట్లాడుతూ సంఘ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తూ జిల్లా వ్యాప్తంగా గౌడజాతి గొంతుకగా నిలుస్తానన్నారు. తనను ఎంపిక చేసిన రాష్ట్ర అధ్యక్షుడితోపాటు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

వ్యవసాయ కార్పొరేటీకరణ ను వెనక్కి తీసుకోవాలి

జనగామ రూరల్‌: మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను, కార్పొరేటీకరణను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్‌, రాష్ట్ర కమిటీ సభ్యుడు మోకు కనకరెడ్డి డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయం వద్ద అఖిల భారత కిసాన్‌ సభ 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడంలో విఫలమైందని, మళ్లీ పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో బూడిద గోపి, సుమ, యాకన్న, శ్రీకాంత్‌, మంగ బీరయ్య, కర్రే సత్తయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

జనగామ: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్‌ మహమ్మారిని కూకటి వేళ్లతో పికిలి పారేసేందుకు పురపాలిక అధికారులు నడుంబిగించారు. 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ వినియోగం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ గతంలోనే 571(బి) జీఓ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిబంధనలను అతిక్రమించిన వ్యాపారులకు జరిమానా వేయాలని అందులో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌తో పాటు 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన కవర్ల అమ్మకాలు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

పెనుముప్పుగా ప్లాస్టిక్‌

ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం పర్యావరణానికి పెనుముప్పుగా మారిపోతుంది. ప్రమాదకరమైన ప్లాస్టిక్‌పై గతం నుంచే నిషేధం అమలులో ఉన్నప్పటికీ, ఎవరూ పట్టించుకోలేదు. ప్లాస్టిక్‌ వినియోగంపై గతంలో ఎన్విరాన్‌మెంటల్‌, శానిటేషన్‌ అధికారులు రెగ్యులర్‌గా తనిఖీలు చేపట్టినప్పటికీ, కొంతకాలం పాటు వదిలేశారు. దీంతో ప్లాస్టిక్‌ అమ్మకాలు తిరిగి మొదలయ్యాయి. అలాగే జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో ప్లాస్టిక్‌ అమ్మకాలపై ఎలాంటి నిషేధం లేదు. జిల్లా కేంద్రంతో పాటు మండలాల పరిధిలో రోజు వారీగా 10 క్వింటాళ్ల వరకు ప్లాస్టిక్‌ కవర్ల అమ్మకాలు జరుగుతాయి. ఇందులో 45 శాతం ప్లాస్టిక్‌ అమ్మకాలు పట్టణంలో జరుగుతుండగా మండలాల పరిధిలో 55 శాతం మేర ఉంటాయని అంచనా. పట్టణంలోని ప్లాస్టిక్‌ నిషేధం అమలులో ఉన్నప్పటికీ, మండలాలు, గ్రామాల్లో మాత్రం యథావిధిగా క్రయవిక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. పురపాలిక, గ్రామపంచాయతీల పరిధిలో రోజు వారీగా సేకరించే చెత్తలో 25 శాతానికి పైగా వాడి పారేసిన ప్లాస్టిక్‌ ఉండడం ఎంత ప్రమాదమో తెలియజేస్తోంది. క్యారీ బ్యాగుల్లో ఉండే పిగ్‌మెంట్లు, ప్లాస్టిక్‌ సైజర్లు, యాంటి ఆక్సిడెంట్ల వల్ల నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. చెత్తతో కలిపి వేసిన క్యారీ బ్యాగులను తింటున్న మూగ జీవాలకు ప్రమాదం లేకపోలేదు.

పట్టింపులేకనే..

ప్లాస్టిక్‌తో ముప్పును సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 2011లో ప్రత్యేక జీఓను జారీ చేసింది. 20 మైక్రాన్ల మందం కంటే తక్కువ ఉన్న పాలిథిన్‌ కవర్లు అమ్మొద్దని ముందుగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆ తర్వాత 75కు పెంచింది. నిబంధనలు అతిక్రమించి తయారీ చేసినా, హోల్‌సేల్‌, రిటేయిల్‌ అమ్మకాలు జరిపినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరికలను జారీ చేసింది. ప్లాస్టిక్‌ వాడకంపై గ్రామస్థాయి నుంచి ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు తయారీ సంస్థలను పూర్తిగా మూసి వేసినప్పుడే వందశాతం నిర్మూలించవచ్చని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయ పడుతున్నారు.

మొదలైన తనిఖీలు

పట్టణంలో గత రెండు, మూడు నెలలుగా ప్లాస్టిక్‌ వినియోగంపై తనిఖీలు చేపడుతున్నారు. కవర్లను అమ్మే వ్యాపారులకు రూ.5 వందల నుంచి అంతకుపైగా జరిమానా వేస్తూ ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు 200 దుకాణాలకు పైగా జరిమానాలు విధించారు. 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ కవర్లతో పాటు బ్యాగులు, వాడి పారేసే గ్లాసులు, ప్రమాదకరమైన ప్లాస్టిక్‌ కవర్లను ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదని సూచనలు చేస్తున్నారు. పట్టణంలో రోజువారీగా 11 టన్నుల చెత్త సేకరణ జరుగుతుంది. ఇందులో ఒకటిన్నర టన్నుల ప్లాస్టిక్‌ వస్తుంది. టీస్టాల్స్‌, హోటల్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌, భోజనం హోటల్స్‌, తదితర దుకాణాల వద్ద ప్లాస్టిక్‌, పేపర్‌ టీ గ్లాస్‌లు, వాటర్‌ బాటిల్స్‌, తాగు నీటి గ్లాసులు ఇలా ఇష్టారీతిలో బయట వేయడంతో అవి డ్రెయినేజీల్లోకి కొట్టుకు పోతున్నాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లలోని డ్రెయినేజీల్లో మురికి నీటికంటే ఎక్కువగా ప్లాస్టిక్‌ వ్యర్థపదార్థాలే కనిపిస్తాయి.

విస్తృత తనిఖీలు చేపడుతున్నాం..

పట్టణంలో ప్లాస్టిక్‌ కవర్లను ఎవరూ వినియోగించొద్దు. దుకాణా యజమానులు సహకరించాలి. ప్లాస్టిక్‌కు బదులుగా జూట్‌ బ్యాగులు ఉపయోగించి, పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలి. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌తో పెను ప్రమాదం పొంచి ఉంది. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి, విస్త్రృత తనిఖీలు చేపడుతున్నాం. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తే జరిమానా విధిస్తాం.

– వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌

ఇన్‌చార్జ్‌ వీసీలతో ముందుకు సాగని పనులు

మూడు జిల్లాలకు విస్తరించిన పరిధి

పెండింగ్‌లో రూ.వందల కోట్ల

అభివృద్ధి కార్యక్రమాలు

ఇప్పటికే స్మార్ట్‌సిటీ, ఇండస్ట్రియల్‌, ఐటీ కారిడార్‌గా పేరు

భవిష్యత్‌లో ఎయిర్‌పోర్ట్‌,

మాస్టర్‌ప్లాన్‌–2041 అమలు

పూర్తి కాలపు ఐఏఎస్‌ ఉంటేనే

ప్రగతిపథంలో ‘కుడా’

న్యూస్‌రీల్‌

పట్టణంలో అడుగడుగునా నిఘా

ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో తనిఖీలు

75 మైక్రాన్ల కంటే తక్కువ ఉండొద్దు

మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20251
1/8

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20252
2/8

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20253
3/8

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20254
4/8

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20255
5/8

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20256
6/8

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20257
7/8

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20258
8/8

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement