
నిధులు
బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
‘పీఎంశ్రీ’ పాఠశాలలకు
– 8లోu
జనగామ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాశాఖకు నిధుల వరద కురిపించాయి. పీఎంశ్రీ, భవిత సెంటర్లు, బాలికలకు శానిటరీ నాప్కిన్స్, యూనిఫాం స్టిచింగ్, క్రీడా సామగ్రి కొనుగోలుకు రూ.37.93 లక్షల మేర నిధులు విడుదల చేసింది. నిధుల ఖర్చుకు సంబంధించి ఉత్తర్వుల కాపీలో పేర్కొనగా.. నిబంధనలను అనుసరించి మెటీరియల్ కొనుగోలు చేయనున్నారు.
పీఎంశ్రీలో 15 పాఠశాలలు..
జిల్లాలో పీఎంశ్రీ(స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకంలో 15 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో 5 మోడల్, ఒక సోషల్ వెల్ఫేర్ (జఫర్‌గఢ్), యూఆర్‌ఎస్, 8 ఉన్నత పాఠశాలలు (జెడ్పీఎస్‌ఎస్) ఉన్నాయి. ఇందులో విద్యను అభ్యసిస్తు న్న 2,650 మంది బాలికలకు శానిటరీ నాప్కిన్స్ కొ నుగోలుకు రూ.7.95 లక్షల బడ్జెట్ విడుదల చేసింది. ఒక్కో విద్యార్థినికి రూ.300 చొప్పున కేటాయించగా, 50 శానిటరీ నాప్కిన్స్ ఇవ్వాల్సి ఉండగా.. పలు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్పోర్ట్స్ మెటీరియల్ కొనుగోలుకు ఒక్కో పా ఠశాలకు రూ.50వేల చొప్పున రూ.7.50 లక్షలు వి డుదల చేసింది. విద్యార్థుల అవసరాలను బట్టి ని బంధనల మేరకు క్రీడా సామగ్రి కొనుగోలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వం 100 నుంచి 150 రకాల ఆప్షన్ చూపించింది.
యూనిఫాం కూలి డబ్బులు..
జిల్లాలో విద్యార్థులకు రెండు జతల యూనిఫాం స్టిచింగ్‌కు సంబంధించి 2024–25 వార్షిక సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న కూలి వేతనం డబ్బులను సర్కారు విడుదల చేసింది. 32,965 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాం ఉచితంగా ఇవ్వగా, స్టిచింగ్ చార్జీల కింద ఒక్కో యూనిఫాంకు స్వయం సహాయక సంఘాలకు రూ.75గా నిర్ణయించింది. ఈ లెక్కన రూ.49.44 లక్షల స్టిచింగ్ చార్జీలకు గాను రూ.32.96లక్షలు గతంలో ఇవ్వగా, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న రూ.16.48 లక్షలు విడుదల చేసింది. 2025–26 నూతన విద్యా సంవత్సరంలో 29,158 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాం కోసం ప్రభుత్వం క్లాత్ పంపించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా పర్యవేక్షణలో యూనిఫాంలను స్టిచింగ్ చేయిస్తున్నారు. జూన్ 10వ తేదీ వరకు యూనిఫాం అందించాలని విద్యాశాఖ అధికారుల ఆదేశాలు జారీ చేశారు.
న్యూస్‌రీల్
ఒక్కో భవిత కేంద్రానికి రూ.2లక్షలు
జిల్లాలో 12 మండలాల పరిధిలో భవిత సెంటర్లు (ప్రత్యేక అవసరాల పిల్లల కేంద్రం) ఉన్నాయి. ఇందులో మూడు కేంద్రాలకు పక్కా భవనాలు ఉండగా, 9 సెంటర్లను ఆయా పాఠశాలలకు అనుబంధంగా కొనసాగిస్తున్నారు. సమగ్ర శిక్షణ ప్రాజెక్టు కింద పక్కా భవనాలు ఉన్న జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ భవిత సెంటర్లకు ఒక్కోదానికి రూ.2లక్షల చొప్పున మొత్తం రూ.6 లక్షలు విడుదల చేశారు. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ప్రభుత్వం సూచించిన మేరకు యూ టేబుల్, కుర్చీలు, స్పోర్ట్స్ కిట్లు, మానవ శరీర భాగాలు, నిత్యందన జీవితంలో ఉపయోగించే యాప్స్, కూరగాయలు, నంబరింగ్ తదితర పరికరాలను కొనుగోలు చేసి, పిల్లలకు వాటిపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
జిల్లాలో 15 స్కూళ్లలో 2,650 మంది విద్యార్థులు
శానిటరీ నాప్కిన్స్, స్పోర్ట్స్ సామగ్రికి బడ్జెట్
గత సంవత్సరం యూనిఫాం స్టిచింగ్ కూలి విడుదల
భవిత సెంటర్లకు రూ.6 లక్షలు
ఒక్కో జతకు రూ.75
జిల్లాలో 2024–25 సంవత్సరంలో విద్యార్థులకు రెండు జతల యూనిఫాం ఇవ్వగా, మహిళా సంఘాలకు స్టిచింగ్ చార్జీల కింద ఒక్కో జతకు రూ.75 చొప్పున ఇచ్చారు. ఇందులో రూ.49.44 లక్షలు రావాల్సి ఉండగా, పెండింగ్‌లో ఉన్న రూ.16.48లక్షల నిధులను విడుదల చేసింది.
– పెనుగొండ రమేశ్,
ఏఏపీ ఇన్‌చార్జ్, జనగామ
సద్వినియోగం చేసుకోవాలి..
పీఎంశ్రీ పథకంలో ఎంపికై న 15 పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 2,650 మంది బాలికలకు శానిటరీ నాప్కిన్స్ కొనుగోలుకు రూ.7.95 లక్షలు, ఒక్కో పాఠశాలకు స్పోర్ట్స్ మెటీరియల్ కొనుగోలుకు రూ.7.50 లక్షల నిధులను విడుదల చేసింది. జిల్లాలోని మూడు భవిత సెంటర్లకు ప్రత్యేక అవసరాల పిల్లల బోధన తరగతులకు అవసరమైన వాటిని కొనుగోలుకు రూ.6 లక్షల బడ్జెట్ వచ్చింది. ఆయా పాఠశాలలు నిధులను సద్వినియోగం చేసుకోవాలి
– భువనగిరి నర్సింహారావు, సీఎంఓ, జనగామ

నిధులు

నిధులు

నిధులు

నిధులు

నిధులు

నిధులు