కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్
జనగామ రూరల్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ పిలుపునిచ్చారు. గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి నెహ్రూ పార్కు, గణేష్ టెంపుల్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో పాదయాత్రల ద్వారా పార్టీ కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు బుడుగుల రమేశ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాయ ఎల్లయ్య, నాయకులు లక్ష్మినర్సయ్య, జగదీష్, అశోక్, మైపాల్, ఈర్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు.


